తొలి కాపీ సితార ఘ‌ట్ట‌మ‌నేనికి

తొలి కాపీ సితార ఘ‌ట్ట‌మ‌నేనికి

‘తారలు దిగి వచ్చిన వేళ..’ పుస్తకం తొలికాపీని సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కుమార్తె సితార‌కు అందించింది సమ్మోహ‌నం టీమ్‌. హీరో సుధీర్‌ బాబు గీసిన బొమ్మలతో ఈ పుస్తకాన్ని స‌మ్మోహ‌నం సినిమా  హీరోయిన్‌ అదితీరావ్ ఇటీవ‌ల లాంఛ‌నంగా రిలీజ్ చేశారు. ఆ పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా రిలీజ్‌ చేయించారు చిత్రబృందం. ఆ పుస్త‌కం ప్రింట్ తొలికాపీని  ఆర‌వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న సితార‌కు ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ పుస్త‌కం మార్కెట్‌లో ఉంద‌ని.. విశాలాంధ్ర‌, న‌వోద‌య‌తోపాటు ఇతర బుక్‌స్టోర్స్‌లో ఈ పుస్త‌కం ల‌భిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు మోహ‌న్ ఇంద్ర‌గంటి తెలిపారు.