అక్కడ కూడా అంబానీ పెట్టుబడులు..

అక్కడ కూడా అంబానీ పెట్టుబడులు..

జమ్మూ అండ్ కశ్మీర్‌, లడాఖ్‌ ప్రాంతాలలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నామని రిలయన్స్‌ సంస్థల అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారాయన. అక్కడి ప్రజలకు కావాల్సిన వాటిపై, చేయవల్సిన అభివృద్దిపై ఇప్పటికే స్సెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. జమ్మూకశ్మీర్‌ అభివృద్దిలో భాగం కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన. రానున్న రోజుల్లో రిలయన్స్‌ జమ్మూకశ్మీర్‌, లడాఖ్‌ ప్రాంతాలలో పెట్టుబడులకు సంబంధించిన మరిన్ని వార్తలను చూస్తారని ఈ సందర్భంగా అంబానీ వెల్లడించారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన తర్వాత.. ఆ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అక్కడ పెట్టుబడులు పెట్టాలని.. సినిమా షూటింగ్‌లు చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.