హైదరాబాద్‌లో మరోసారి భారీగా నగదు పట్టివేత..

హైదరాబాద్‌లో మరోసారి భారీగా నగదు పట్టివేత..

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోదాల్లో పాల్గొంటున్న పోలీసులు నోట్ల కట్టలు చూసి షాక్‌గురయ్యే విధంగా భారీగా నగదు పట్టుబడుతూనే ఉంది. నిన్న హైదరాబాద్‌లో రూ.8 కోట్లు పట్టుబడిన విషయం హాట్‌టాఫిక్ కాగా... ఇవాళ హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో రూ.2.4 కోట్ల క్యాష్‌ను పట్టుకున్నారు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్‌ నుంచి నల్గొండకి డబ్బులు తరలిస్తున్నట్టు గుర్తించారు. నల్గొండ బరిలో ఉన్న అభ్యర్థి బంధువులే ఈ డబ్బులు తీసుకెళ్తున్నట్టుగా తేల్చారు. రూ.2.4 కోట్లను బైక్‌పై తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.