కరోనా లక్షణాల్లో దీన్ని కూడా చేర్చాలి...49శాతం మందికి అది తెలియడంలేదు...
కరోనా కేసులు ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు 59 లక్షలకు పైగా నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి వాటిని కరోనా ప్రధాన లక్షణాలుగా తీసుకున్నారు. కానీ, కరోనా వైరస్ సోకిన వ్యక్తులు రుచిని కోల్పోతున్నారని తాజా పరిశోధనలు చెప్తున్నాయి.
పరిశోధన ప్రకారం జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి లేకున్నా, రుచిని కోల్పోతున్నారని, అలాంటి వారిలో కూడా కరోనా వస్తున్నట్టు తాజా పరిశోధనలు చెప్తున్నాయి. ఓహియోలో 817 మంది రోగులపై పరిశోధన చేయగా అందులో 49.8 శాతం మంది రుచిని కోల్పోయినట్టుగా తాజా పరిశోధనలో తేలింది. రుచిని కోల్పోయే లక్షణాన్ని కూడా కరోనా లక్షణాల్లో ఒకటిగా చేర్చాలని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)