సైరస్‌ మిస్త్రీ వ్యవహారం.. సుప్రీంకోర్టుకు టాటా సన్స్..

సైరస్‌ మిస్త్రీ వ్యవహారం.. సుప్రీంకోర్టుకు టాటా సన్స్..

దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం టాటా సన్స్‌ వ్యవహారంలో మరోసారి వార్తలకెక్కింది... సైరస్ మిస్త్రీ విషయంలో ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. డిసెంబర్‌ 18 సైరస్‌ మిస్త్రీకి అనుకూలంగా ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పునిచ్చింది. టాటాసన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఛైర్మన్‌గా, టీసీఎస్‌, టాటా ఇండస్ట్రీస్‌, టాటా టెలిసర్వీస్‌లకు డైరెక్టర్‌గా మిస్త్రీని నియమించాలని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును టాటా సన్స్‌ సుప్రీంలో సవాల్‌ చేసింది. ఈ పిటిషన్‌పై జనవరి 6న విచారణ జరిగే అవకాశం ఉంది. అయితే, టీసీఎస్‌ బోర్డుమీటింగ్‌ జనవరి 9న జరగనుండటంతో.. సత్వర ఉపశమనం కల్పించాలని టాటాసన్స్‌.. కోర్టును కోరింది. కాగా, అనూహ్యంగా మిస్త్రీని టాటాసన్స్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.