మహిళా ఎంపీకి అసభ్యంగా సైగలు..క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..!

మహిళా ఎంపీకి అసభ్యంగా సైగలు..క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..!

జాధవ్ పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ,నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిమి చక్రవర్తి జిమ్ కి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ఓ క్యాబ్ డ్రైవర్ కారు తో ఫాలో అయ్యాడట. అంతే కాకుండా కారును దగ్గరకు తెచ్చి అసభ్యంగా సైగలు చేసాడట. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం అతడి కారును వెంబడించి నిందితున్ని పోలీసులకు అప్పగించింది. మహిళా ఎంపీ ఫిర్యాదుమేరకు పోలీసులు క్యాబ్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మిమి చక్రవర్తి ట్వీట్ చేశారు. ‘నాతో అసభ్యంగా ప్రవర్తిస్తే మొదట లైట్ తీసుకున్నా. కానీ అతడిని అలాగే వదిలేస్తే ఆ టాక్సీలో ప్రయాణించే మహిళలకు కూడా రక్షణ ఉండదని భావించి పోలీసులకు కంప్లైంట్ చేశాను. అందుకే అతడి కారును వెంబడించి పట్టుకుని మరీ పోలీసులకు అప్పగించాను’ అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మిమి చక్రవర్తి ఎంపీగా కొనసాగుతూ మరో వైపు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.