హైదరాబాద్‌లో తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం..! ఆర్టీసీ బస్సుకు యువతి బలి..

హైదరాబాద్‌లో తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం..! ఆర్టీసీ బస్సుకు యువతి బలి..

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు మరో యువతి ప్రాణాలు బలితీసుకుంది... తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో జరిగిన ప్రమాదంలో బస్సు చక్రాల కింద ఆ యువతి నలిగిపోయింది.. మాసాబ్ ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ వైపు ఓ యువతి స్కూటీపై వెళ్లుండగా.. ఆ స్కూటీని బర్కత్‌పురా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న మహిళ తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన జనం ఒక్కసారిగా తాత్కాలిక బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. నిర్లక్ష్యంగా బస్సు నడిపావంటూ డ్రైవర్‌ చొక్కావిప్పి చితకబాదారు.. మరోవైపు బస్సుపై రాళ్లు రువ్వడంతో.. బస్సు అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతురాలు సోహిని సక్సేనాగా గుర్తించారు పోలీసులు.. ఆమె టీసీఎస్‌లో ఉద్యోగినిగా తెలుస్తోంది.