నిరాశపరిచిన ఐటీ దిగ్గజం టీసీఎస్..

నిరాశపరిచిన ఐటీ దిగ్గజం టీసీఎస్..

ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాల నిరాశపరిచాయి. జులై- సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. నికర లాభం స్వల్పంగా 1.8 శాతమే పెరిగి రూ.8,042 కోట్లుగా నమోదైంది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో రూ.7,091 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆదాయం కూడా రూ.36,854 కోట్ల నుంచి కేవలం 5.8 శాతం పెరిగి రూ.38,977 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన చూసినా లాభం 1 శాతం తగ్గగా, ఆదాయంలో 2.1 శాతం మాత్రమే వృద్ధి ఉంది. సాధారణంగా ఐటీ కంపెనీలకు జులై- సెప్టెంబర్‌ను బలమైన త్రైమాసికంగా చెబుతుంటారు. అందుకే స్థిర కరెన్సీ రూపేణా ఆదాయంలో 9- 9.5 శాతం వృద్ధిని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఈ అంచనాల కంటే తక్కువగానే ఆదాయం పెరిగింది. అటు నిర్వహణ మార్జిన్‌ విషయంలోనూ కంపెనీ అంచనాలను అందుకోలేకపోయింది. సమీక్ష త్రైమాసికంలో నిర్వహణ మార్జిన్‌ 24 శాతంగా నమోదైంది.