టీసీఎస్‌ బైబ్యాక్ ఆఫర్‌

టీసీఎస్‌ బైబ్యాక్ ఆఫర్‌

టీసీఎస్‌ కంపెనీ తన వద్ద భారీగా క్యాష్‌ ఉండటంతో... దాన్ని షేర్ల బైబ్యాక్‌ కోసం మరోసారి ఉపయోగించాలని నిర్ణయించింది. గత ఏడాది ఇన్వెస్టర్ల నుంచి రూ. 16,000 కోట్ల విలువైన షేర్లను  తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేసిన టీసీఎస్‌ ఈఏడాది కూడా అంతే మొత్తానికి అంటే రూ. 16,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది. ఒక్కో షేర్‌ను రూ. 2,100  ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఎన్‌ఎస్‌ఈలో ఇవాళ టీసీఎస్‌ షేర్‌  మూడు శాతం లాభంతో రూ. 1,841 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే కంపెనీ సుమారు 15 శాతం అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తోందన్న మాట. గత ఏడాది బైబ్యాక్‌ చేసిన తరవాత కంపెనీ బోనస్‌ ఇష్యూ కూడా ఇచ్చింది. ఎక్స్ఛేంజీ నిబంధనలకు అనుగుణంగా టెండర్‌ ఆఫర్‌ పద్ధతిలో షేర్లను కొనుగోలు చేస్తామని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు పంపిన వర్తమానంలో పేర్కొంది. కంపెనీలో వివిధ వాటా దారుల తాజా స్థితి ఇది.