టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ, ఒకరు మృతి..

టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ, ఒకరు మృతి..

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు దిగి.. రాళ్లు రువ్వుకోగా... ఇరు వర్గాల ఘర్షణ అనంతపురం జిల్లాలో ఓ టీడీపీ సానుభూతిపరుడి ప్రాణాలు తీసింది. జిల్లాలోని తాడిపత్రి మండలం వీరపురాము గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో టీడీపీ సానుభూతిపరుడు సి. భాస్కర్‌రెడ్డి మృతిచెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్లర్లు చెలరేగకుండా భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.