చెవిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న టీడీపీ.. తీవ్ర ఉద్రిక్తత..!

చెవిరెడ్డి ప్రచారాన్ని అడ్డుకున్న టీడీపీ.. తీవ్ర ఉద్రిక్తత..!

చంద్రగిరి నియోజకవర్గం మరోసారి రణరంగమైంది.. చంద్రగిరి మండలం ముంగిలిపట్టులో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గ్రామంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారానికి రావద్దంటూ టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ టీడీపీ కార్యకర్త ఎమ్మెల్యే చెవిరెడ్డి కారు అడ్డుకున్నారు. మరోవైపు ఎందుకు ప్రచారం చేయకూడదంటూ చెవిరెడ్డి, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఘటనాస్థలానికి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా చేరుకోవడంతో.. ఇరువర్గాలు పెద్దసంఖ్యలో తరలివచ్చాయి. దీంతో రంగంలోకి దిగి పోలీసులు గ్రామంలో భారీగా మోహరించాయి.