ఆలయాల దాడులలో అరెస్ట్ అయిన వారి వివరాలు ఇవే !

ఆలయాల దాడులలో అరెస్ట్ అయిన వారి వివరాలు ఇవే !

ఆలయాలపై దాడులను కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు ఏపీ డీజీపీ.  రాష్ట్రంలో మత విధ్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గౌతం సవాంగ్‌. సోషల్ మీడియాలో తప్పడు ప్రచారం చేసినా... చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఆలయాల భద్రతలో మ్యాపింగ్, సీసీ కెమెరాలు  కీలకమన్నారు. పోలీస్ భద్రతతో పాటు టెంపుల్ కమిటీలు, మత సామరస్య కమిటీలు సమన్వయం చేస్తున్నాయని చెప్పారు డీజీపీ. ఇక 17 మంది టీడీపీ నేతలు, నలుగురు బీజేపీ నేతల హస్తం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 13 మంది టీడీపీ నేతలు, ఇద్దరు బీజేపీ నేతల అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు డీజీపీ సవాంగ్‌. ఇక వారి వివరాలు ఇలా ఉన్నాయి. 

తూర్పుగోదావరి జిల్లా : 12-09-2020..రాజమండ్రి వినాయక విగ్రహం కూల్చివేత కేసు : బొమ్మూరు పీఎస్‌లో కేసులు నమోదు

1.వెల్లంపల్లి ప్రసాద్‌ బాబు - అరెస్ట్( టీడీపీ)

2.చితికెన సందీప్‌( టీడీపీ )

3. అడప వరప్రసాద్‌( బీజేపీ)

4.కర్తూరి శ్రీనివాసరావు( బీజేపీ)

---------------

6-10-2020

గుంటూరు జిల్లా నరసరావుపేట పీఎస్‌లో కేసులు నమోదు, శృంగేరి శంకరమఠంపై తప్పుడు ప్రచారం కేసులో టీడీపీ నేత చల్లా మధుసూదన్‌ రెడ్డి అరెస్ట్

---------------

కడప జిల్లా : బద్వేల్‌ రూరల్‌ పీఎస్‌లో కేసు నమోదు, కొండలవీడులో ఆంజనేయస్వామి  విగ్రహానికి  చెప్పుల దండ వేసిన కేసు, టీడీపీ సానుభూతిపరుడు బొజ్జన సుబ్బారాయుడు  అరెస్ట్. 

--------------------

కర్నూలు జిల్లా : 28-12-2020 : మద్దికెరలో మద్దమ్మ ఆలయం కూల్చిన కేసు. 

టీడీపీ కార్యకర్త గొల్ల పెద్దయ్య  అరెస్ట్

టీడీపీ కార్యకర్త    గద్ద రామాంజనేయులు అరెస్ట్

టీడీపీ కార్యకర్త    బర్మే జయరాముడు అరెస్ట్

టీడీపీ కార్యకర్త    సయ్యద్‌ ఫరూకుద్దీన్‌ అరెస్ట్

-------

కర్నూలు జిల్లా

మర్లమందలో ఆంజనేయస్వామి విగ్రహం కూల్చిన కేసు  

టీడీపీ నేత విశ్వనాథ్‌రెడ్డి అరెస్ట్

-------

05-01-2021

ప్రకాశం జిల్లా సింగరాయకొండ పీఎస్‌లో కేసు నమోదు

నరసింహస్వామి టెంపుల్‌ ధ్వంసం కేసులో

మద్దస్వామి మౌలాలీ ( టీడీపీ) అరెస్ట్

గాలి హరిబాబు     (టీడీపీ) అరెస్ట్

కాకర్ల నర్సింహారావు( టీడీపీ) అరెస్ట్

మించాల బ్రహ్మాయ్య ( టీడీపీ)

వేల్పుల వెంకట్రావ్‌  ( టీడీపీ)

సిరిమల్లి సురేష్   ( టీడీపీ)

-------

విశాఖ జిల్లా

గోలుగొండ పీఎస్‌లో కేసు నమోదు

వినాయక విగ్రహం ధ్వంసం కేసులో

కిల్లాడ నరేష్ ( టీడీపీ) అరెస్ట్ )

2. పైలా సత్తిబాబు( టీడీపీ) అరెస్ట్

 

శ్రీకాకుళం జిల్లా 

సోంపేటలో హనుమాన్‌ విగ్రహం ధ్వంసం కేసులో

కొంచడా రవికుమార్‌  (బీజేపీ) అరెస్ట్

 

23.09.2020

సరస్వతి దేవి విగ్రహంపై సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన కేసు, ధర్మవరపు ఆచార్య (బీజేపీ )  అరెస్ట్