అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, విప్‌ ఖరారు

అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, విప్‌ ఖరారు

శాసనసభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్లుగా కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడులను నియమించినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ప్రకటించారు. అసెంబ్లీలో విప్‌గా బాలవీరంజనేయస్వామిని నియమించారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా యనమల రామకృష్ణుడుకు అవకాశం దక్కగా.. డొక్కా మాణిక్యవరప్రసాద్‌, శ్రీనివాసులు, సంధ్యా రాణిలను  డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు. మండలిలో విప్‌గా బుద్దా వెంకన్నను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.