రేపటి నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారం

రేపటి నుంచి టీడీపీ ఎన్నికల ప్రచారం

రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం అధికార టీడీపీ తన ప్రచారాన్ని ఆదివారం నుంచి ప్రారంభించనుంది. అమరావతిలో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై నేతలు చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై సమీక్షించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి వెళ్లే అంశంపై సమీక్షించారు. నేతల వలసలు, చేరికపై కూడా చర్చించారు. భేటీ అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలువ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల కోసం రేపట్నుంచే ప్రచారాన్ని ప్రారంభిస్తామని మంత్రి సొమిరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రకటనకు ముందే కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికలో సమర్థత, పనితీరుకే ప్రాధాన్యం ఉంటుందని సోమిరెడ్డి స్పష్టం చేశారు.