టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..

టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్‌లో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. సార్వత్రిక ఎన్నికల తర్వాత.. టీడీపీకి గుడ్ బై చెప్పి ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కొందరు బీజేపీ, వైసీపీలో చేరగా.. తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన బాపట్ల మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మ.. సీఎం జగన్ సమక్షంలోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.. మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మతో స్థానిక టీడీపీ నేతలు మంతెన సుబ్బరాజు, వి. వెంకటేశ్వరరాజు, ఎం.వి. సర్వేశ్వర యాదవ్, పృద్వీరాజు, మంతెన నాగరాజు, బాపూజీ, మోదుగుల వెంకటరెడ్డి.. తదితరులు వైపీసీ కండువా కప్పుకున్నారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి పాల్గొన్నారు.