టీడీపీ తొలి జాబితాలో ఎవరెవరు?

 టీడీపీ తొలి జాబితాలో ఎవరెవరు?

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ టీడీపీ విడుదల చేయనుంది. ఈ జాబితాలో 120-25 అసెంబ్లీ, 12-14 ఎంపీ స్థానాలకు పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసంలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి ఈ భేటీకి మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులను ఆహ్వానించారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించి.. తొలి జాబితా ప్రకటించనున్నారు అధినేత చంద్రబాబునాయుడు.

ఎవరెవెరు ఎక్కడెక్కడ పోటీ చేయాలో ఇప్పటికే సూత్రప్రాయంగా ఖరారైనప్పటికీ కొన్ని చోట్ల ఒకరిద్దరి మధ్య పోటీ ఉంది. ఇదే విషయమై ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమాలోచనలు జరుపుతున్నారు. విభేదాలున్న చోట అసమ్మతి నేతలను పిలిపించి చర్చిస్తున్నారు.