జగన్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు..!

జగన్‌పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌పై తెలుగుదేశం పార్టీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. నిన్న తన ప్రసంగంలో సున్నా వడ్డీ రుణాల విషయంలో శాసనసభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ టీడీపీ నోటిసిచ్చింది. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను కలిసి నోటీసు అందజేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. సభను తప్పుదొవ పట్టించినందుకు సీఎంపై చర్యలు తీసుకోవాలని కోరారు. 2014-16 వరకు సున్నా వడ్డీ అమలు చేసినట్టు ఎస్‌ఎల్‌బీసీకి అధికారులు లేఖ రాశారన్నారు. రికార్డులు చూడకుండా జగన్‌ అవాస్తవాలు చెప్పారన్నారు.
ఇదే అంశంపై ఇవాళ సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు ప్రసంగించారు. తప్పుడు సమాచారంతో జగన్‌ సవాల్‌ చేశారని ఆరోపించారు. దీనికి స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. సీఎం జగన్‌ నిన్న చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇక..సున్నా వడ్డీ రుణాలపై ఇవాళ కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు.