కౌంటింగ్ వద్ద అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు

కౌంటింగ్ వద్ద అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు

రేపటి ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీనే విజయం సాధిస్తుందని టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ ధీమా వ్యక్తం చేశారు. అందుకు వంద కాదు వెయ్యి కారణాలు ఉన్నాయని, వైసీపీ గెలవడానికి వారి వద్ద ఒక్క కారణం కూడా లేదని అన్నారు. బుధవారం ఆమె అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రేపు కౌంటింగ్ సెంటర్ల వద్ద వైసీపీ కార్యకర్తలు అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కేంద్రంలో గెలుపు తమదేనంటూ మోడీ సంబరపడుతున్నారని, ఎన్డీయేకు 200 సీట్లు కూడా రావని ఆమె జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పక్కాగా గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తంచేశారు.