మోడీతో జగన్, కేసీఆర్ జతకట్టడం సిగ్గుచేటు

మోడీతో జగన్, కేసీఆర్ జతకట్టడం సిగ్గుచేటు

ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పై మరింత కక్ష పెరుగుతుందని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్నూలులో ఆదివారం కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ నాయకత్వాన్ని ప్రజలు అసహించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రతి ఎన్నికల ముందు జగన్ సెల్ఫ్ గోల్ వేసుకుంటాడని ఆరోపించారు. జగన్ క్యారెక్టర్ ఏంటో వివేకహత్యతో తేలిపోయిందని అన్నారు. ఏపీని రాబందులా పీక్కుతింటున్న మోడీతో జగన్, కేసీఆర్ జతకట్టడం సిగ్గుచేటని అన్నారు. జగన్ ను సీఎం చేసేందుకు కేసీఆర్ టీడీపీ నాయకులను, ప్రజలను ఫాక్షనిస్టుల్లా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ తో జతకట్టడం వల్లే జగన్ గ్రాఫ్ పడిపోయిందని వ్యాఖ్యానించారు.