టీడీపీకి షాక్... వైసీపీలో చేరిన బీదా మస్తాన్‌రావు

టీడీపీకి షాక్... వైసీపీలో చేరిన బీదా మస్తాన్‌రావు

నెల్లూరులో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది... టీడీపీకి గుడ్‌బై చెప్పిన బీదా మస్తాన్‌రావు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మస్తాన్ రావు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అంతకుముందు ఆయన విజయసాయిరెడ్డితో భేటీఅయ్యారు. పార్టీ కండువా కప్పి మస్తాన్‌రావును వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్... ఇక, సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చే పార్టీ మారానని చెబుతున్నారు మస్తాన్ రావు. అటు బీదా మస్తాన్‌రావు వైసీపీలో చేరికపై నెల్లూరు అసంతృప్తి చెలరేగుతోంది. మస్తాన్‌రావు చేరికపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ సీటు త్యాగం చేసిన నాకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు బీదా మస్తాన్‌రావును పార్టీలో చేర్చుకోవడంపై మేకపాటి కినుకు వహించారు. ఇక, బీదా మస్తాన్‌రావు.. పార్టీలో చేరిన కార్యక్రమానికి విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మంత్రి అనిల్ కుమార్ హాజరయ్యారు.