సీఈవో ద్వివేది, సీఎస్ ఎల్వీ లపై ఈసీఐకి ఫిర్యాదు

సీఈవో ద్వివేది, సీఎస్ ఎల్వీ లపై ఈసీఐకి ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై టీడీపీ కార్యకర్త దేవీబాబు చౌదరి ఈసీఐకి ఫిర్యాదు చేశారు. సీఈవో ద్వివేది పక్షపాతంతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుంటే.. కేబినెట్‌ నిర్ణయాలు అమలుకాకుండా సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణం అడ్డుకుంటున్నారని దేవీబాబు చౌదరి ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు ఫోటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో దూషణలకు పాల్పడుతున్నారని తెలిపారు. సోషల్‌ మీడియాలో విజయసాయిరెడ్డి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆయప తన ఫిర్యాదు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.