'ఈ చెట్టు మీకు.. మీ ఓటు మాకు..'

'ఈ చెట్టు మీకు.. మీ ఓటు మాకు..'

ఎన్నికల సమయంలో ఎన్నో చిత్రాలు చూస్తుంటాం.. మరికొందరు నేతలు వినూత్న తరహాలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటారు. తిరుపతిలో టీడీపీ నేత అజయ్ ప్రతాప్ వినూత్న తరహాలో ప్రచారంలో పాల్గొన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సుగుణమ్మ గెలుపుకోసం ఆమె తరపున సీనియర్ నేత అజయ్ ప్రతాప్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించాయి టీడీపీ శ్రేణులు. ఆటోనగర్‌లో ఇంటింకి తిరుగుతూ.. చెట్లు పంచుతూ.. ఓట్లు అడిగారు. చెట్లు పర్యావరణ పరిరక్షణకు.. టీడీపీ సమాజ పరిరక్షణకు... మీ ఓటు టీడీపీకే వేయాలంటూ విజ్ఞప్తి చేశారు.