టీడీపీ నేత కోట్ల అనుచరుడి దారుణ హత్య..

టీడీపీ నేత కోట్ల అనుచరుడి దారుణ హత్య..

కర్నూలు జిల్లాలో దారుణ హత్య జరిగింది... జిల్లాలోని డోన్‌ మండలం మల్లెంపల్లి దగ్గర తాపలకొత్తూరుకు చెందిన శేఖర్ రెడ్డిని గుర్తుతెలిని వ్యక్తులు దారుణంగా చంపేశారు. టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై వెళ్తున్న శేఖర్‌రెడ్డిని దారికాసి చంపేశారు దుండగులు. తలపై బండరాయితో మోది శేఖర్‌రెడ్డిని హతమార్చారు. కాగా, శేఖర్‌రెడ్డి.. కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అనుచరుడుగా గుర్తించారు. హత్యకు రాజకీయ కారణాలా?, వ్యక్తిగత కక్షలా? లేక వ్యాపార లావాదేవీలా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, హత్యకు గురైన శేఖర్‌రెడ్డి.. సొంత ఊరిలో నివాసం ఉండడం లేదు.. ఆయన అనంతపురం జిల్లాలో ఉంటూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండగా.. తాజాగా సొంత ఊరికి వచ్చిన శేఖర్‌రెడ్డిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే, కౌంటింగ్ ముందు రోజు జరిగిన ఈ హత్య.. రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుండగా... డోన్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.