ఏపీ స్పీకర్‌ మీద మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కూన రవి

ఏపీ స్పీకర్‌ మీద మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కూన రవి

స్పీకర్ తమ్మినేని సీతారాంకు మీడియా ముందుకు రాగానే పూనకం వస్తుందని, తప్పతాగి నోటికొచ్చినట్లు వాగుతుండటం తమ్మినేనికి అలవాటు అని ఆయన విమర్శించారు. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లాలని, స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని డిక్లరేషన్ అవసరం లేదనడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. సోనియాగాంధీకి ధ్వంద పౌరసత్వం ఉందని మాట్లాడుతున్న సీతారాంకు సిగ్గుందా అని ప్రశ్నించారు. స్పీకర్ పదవిలో ఉండి కూడా అజ్ఞానంతో అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. తమ్మినేని టీడీపీని వీడి ప్రజారాజ్యంలోకి వెళ్లడాన్ని రాజకీయ వ్యభిచారం అంటారని, తమ్మినేని ఒక రాజకీయ వ్యభిచారి అని ప్రజారాజ్యం నుంచి టీడీపీకి తిరిగివచ్చినపుడు తల్లి ఒడిలోకి వస్తున్నంత సంతోషంగా ఉందన్నారని పేర్కొన్నారు.

అలా తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన వ్యక్తి కాబట్టే 15 ఏళ్లు ఆమదాలవలస ప్రజలు తమ్మినేనిని ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. శాసనసభా వ్యవస్థ పై మాకు పూర్తి విశ్వాసం ఉందని, నోటీసులకు కచ్చితంగా సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. ప్రివిలేజ్ నోటీసులకు మేం భయపడటం లేదన్న ఆయన అక్రమాలకు, అవినీతికి, కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ తమ్మినేని అని పేర్కొన్నారు. సభా గౌరవాన్ని కాపాడాల్సిన తమ్మినేని పరిధి దాటి మాట్లాడుతున్నారని, ముందు ఎమ్మెల్యేని ఆ తర్వాతే స్పీకర్ ని అని తమ్మినేని పదే పదే చెబుతన్నారని అలా తమ్మినేని ఎమ్మెల్యేగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మేం కూడా ప్రజాప్రతినిధులుగానే స్పందిస్తున్నామని ఆయన లాజికల్ గా స్పందించారు.

నేనెప్పుడూ స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేనిని విమర్శించలేదని ఆమదాలవలస ఎమ్మెల్యేగా ఉన్న తమ్మినేని సీతారాంను మాత్రమే విమర్శించానని రవి పేర్కొన్నారు. రేపొద్దున్న ముందు చిన్న పిల్లాడ్ని..ఆ తర్వాతే స్పీకర్ ని అని బట్టలిప్పి తిరుగుతారా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల పై చేసిన ఆరోపణలను తమ్మినేని నిరూపించాలని రవి డిమాండ్ చేశారు. హ్యాయ్ ల్యాండ్ భూముల వ్యవహారంలో దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలన్న ఆయన తమ్మినేని వాడిన భాషను భారతదేశంలో ఏ స్పీకర్ వాడి ఉండరని పేర్కొన్నారు. తమ్మినేని అవినీతిని బట్టబయలు చేసే సాక్ష్యాలున్నాయని చట్టసభలోనైనా..న్యాయపరంగానైనా...తేల్చుకుందాం తమ్మినేని సిద్ధమా ? అని ప్రశ్నించారు.