మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య

మంగళగిరిలో టీడీపీ నేత దారుణ హత్య

గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత తాడిబోయిన ఉమా యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంటి సమీపంలోనే వేటకొడవళ్లతో దుండగులు నరికి చంపారు. ముగ్గురు వ్యక్తులు ఆయనపై దాడికి దిగినట్లు స్ధానికులు తెలిపారు. గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమా యాదవ్‌ మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల అనుచరుడు. ఎన్నికల తరువాత తమ పార్టీ నేతలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.