రీపోలింగ్ పై టీడీపీ నాయకుల అభ్యంతరం

రీపోలింగ్ పై టీడీపీ నాయకుల అభ్యంతరం

చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు స్థానాల్లో రీపోలింగ్ పై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని కలిశారు. సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ రావు ఎన్నికల సంఘం అధికారులకు వినతి పత్రం అందచేశారు. వైసీపీ ఫిర్యాదుపై విచారణ లేకుండానే రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్త కండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 11న జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మే19న ఐదు స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.