గుడివాడ టీడీపీలో అసమ్మతి సెగలు

గుడివాడ టీడీపీలో అసమ్మతి సెగలు

కృష్ణా జిల్లాలోని గుడివాడ టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అసెంబ్లీ స్థానానికి దేవినేని అవినాష్‌ పేరు దాదాపు ఖరారు కావడంతో ఓ వర్గం సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రావి వేంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీ ఈ సమావేశానికి హజరయ్యారు. స్ధానికేతరుడికి సీటు కేటాయిస్తే టీడీపీకి సహకరించకూడదని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు పార్టీ నేతలు నిర్ణయించారు.

గుడివాడ అసెంబ్లీ స్థానానికి దేవినేని అవినాష్‌ పేరు దాదాపు ఖరారు అయ్యింది. గుడివాడ నేతలతో సమావేశం తర్వాత ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఇప్పటికే సీఎం చంద్రబాబు గుడివాడకు సంబంధించిన సర్వే నివేదికలను పరిశీలించారు. ఇదిలా ఉంటే ఈసారి ఎలాగైనా సరే గుడివాడలో జెండా పాతాలని టీడీపీ సన్నాహాలు చేస్తోంది. గుడివాడ నుంచి పోటీ విషయమై ఇదివరకే అవినాష్ స్పందిస్తూ.. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధమేనని స్పష్టం చేశారు.