'సర్వే చేసి మా ఓట్లు తొలగిస్తున్నారు..!'

'సర్వే చేసి మా ఓట్లు తొలగిస్తున్నారు..!'

సర్వే పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను గుర్తించి.. వాటిని తొలగిస్తున్నారని ఆరోపించారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓట్లను తొలగించడానికి వచ్చిన వారిని ట్యాబ్‌లతో సహా పోలీస్ స్టేషన్‌లో అప్పగిస్తే మా నాయకులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. మా నాయకులను కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారని విమర్శించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి.. ట్యాబ్ ల ద్వారా వైసీపీ ఓటర్లను గుర్తించి వారి ఓట్లను తొలగిస్తున్నారని... ఇదంతా అమరావతి నుంచే నడుస్తోందని ఆరోపించారు. 14,500 మంది ఓట్లను ఈ విధంగా తొలగించడానికి  ఫారమ్ 7 ద్వారా తెలుగుదేశం వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నారని ఆరోపించారు చెవిరెడ్డి.