సిఎంపై కోడాలి వ్యాఖ్యలతో దుమారం

సిఎంపై కోడాలి వ్యాఖ్యలతో దుమారం

గుడివాడలో రాజకీయం వేడెక్కింది. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ టీడీపీ నేతల ధర్నా దిగారు. గుడివాడ వైసీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వైసిపి కార్యాలయం దగ్గర టీడీపీ నేతలు, వైసీపీ శ్రేణులు పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు యత్నిస్తున్నారు.