రాజ్ నాథ్ తో టీడీపీ మంత్రులు, ఎంపీలు భేటీ

 రాజ్ నాథ్ తో టీడీపీ మంత్రులు, ఎంపీలు భేటీ

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో టీడీపీ మంత్రులు, ఎంపీల బృందం భేటీ అయింది. విభజన సమస్యలు, ప్రత్యేక హోదా అంశం, తిత్లీ తుపాను తీవ్రతపై ఆయనకు వినతిపత్రాలు అందచేశారు. తిత్లీ తుపాను తీవ్రతను టీడీపీ ప్రజాప్రతినిధులు రాజ్ నాధ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. తిత్లీ తుపాన్ సాయంపై ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖను ఆయనకు అందచేశారు. అనంతరం ఏపీ పోలీసు ఉన్నతాధికారులతో  భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై హోంమంత్రి వద్ద ప్రస్తావించారు. విశాఖ మన్యంలో జరిగిన టీడీపీ ప్రజాప్రతినిధుల హత్యల అనంతరం మావోల కదలికలను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు.