వైఎస్ జగన్ తో ఎమ్మెల్యే మేడా భేటీ

వైఎస్ జగన్ తో ఎమ్మెల్యే మేడా భేటీ

టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గంజాయి వనం నుంచి తులసివనంలోకి వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. టీడీపీ అధినేత చెప్పేదొకటి చేసేదకటి. అక్కడ నాలుగున్నర సంవత్సరాలు నరకయాతన అనుభవించానని అన్నారు.

చంద్రబాబు కల్లబొల్లి మాటలు.. ప్రజలు నమ్మడం లేదు. వైఎస్, షర్మిల, జగన్ పాదయాత్రలు చరిత్ర సృష్టించాయి. చంద్రబాబు ను నమ్మి ఇంకా ఉండలేను. ఈనెల 31న పార్టీలో చేరడానికి జగన్ సమయం ఇచ్చారు. పదవులకు రాజీనామా చేసి పార్టీలో చేరమని జగన్ సూచించారు. రాజీనామా లేఖను బుధవారం స్పీకర్ ఫార్మట్ లో పంపిస్తాను. రాజశేఖర్ రెడ్డి దయతో ఆదినారాయణ రెడ్డి గెలిచాడు. టీడీపీలో చేరి మంత్రి అయ్యాడని మేడా మల్లికార్జున రెడ్డి విమర్శించారు.