మోడీ హవా అంచనా వేయలేకపోయాం..

మోడీ హవా అంచనా వేయలేకపోయాం..

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ హవాను అంచనా వేయలేకపోయామని వ్యాఖ్యానించారు ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప... తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన టీడీపీ సమీక్ష సమావేశంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి టీడీపీని పటిష్టం చేస్తామన్నారు. పార్టీలో యువతకు పెద్దపీఠ వేస్తామన్న ఆయన... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు సమిష్టి కృషి చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై సమీక్షలు నిర్వహిస్తామన్న మాజీ డిప్యూటీ సీఎం... గెలిచిన 4 నియోజకవర్గాల్లో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అయితే, దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా అంచనా వేయలేకపోయామని... మోడీకి ప్రజల్లో మంచి ఆధరణ ఉందన్నారు చినరాజప్ప.