కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేసిన టీడీపీ ఎమ్మెల్యే...

కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేసిన టీడీపీ ఎమ్మెల్యే...

తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేశారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఆర్. కృష్ణయ్య... ఎల్బీనగర్‌లో జరిగిన 'మన నగరం' కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆర్. కృష్ణయ్య... ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌ను విశ్వ నగరం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని వెల్లడించిన కృష్ణయ్య... ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కోట్ల రూపాయాలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న ఆర్. కృష్ణయ్య... పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ను, ఆయన అమలు చేస్తున్న  పథకాలను ఆకాశానికి ఎత్తిన సంగతి తెలిసిందే.