దమ్ముంటే వైసీపీకి ప్రచారం చేయండి: అశోక్ బాబు

దమ్ముంటే వైసీపీకి ప్రచారం చేయండి: అశోక్ బాబు

తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు దమ్ముంటే ఏపీకి వచ్చి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయండని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సవాల్ విసిరారు. ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు కేసీఆర్, బీజేపీ కుట్ర పన్నాయి. కేసీఆర్, కేటీఆర్ వైసీపీకి మద్దతు ఇచ్చుకోండి.. కానీ మా పార్టీ సమాచారాన్ని ఎలా చోరీ చేస్తారు? అని అశోక్ బాబు ప్రశ్నించారు. 

మీరు చేసిన దాడుల వలన హైదరాబాద్ బ్రాండ్ పోయింది. హైదరాబాద్ లో ఉన్న కంపెనీలను మేము కూడా విజయవాడ, విశాఖ తరలిస్తాం. దమ్ముంటే ఏపీకి వచ్చి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేయండి. ఈ వ్యవహారంపై గవర్నరుకు ఫిర్యాదు చేస్తాం. న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాం.. న్యాయ పోరాటం చేస్తాం అని అశోక్ బాబు తెలిపారు.