మాధవ్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్..

మాధవ్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్..

తెలుగుదేశం పార్టీ... నారా టీడీపీ..! నందమూరి టీడీపీగా చీలిపోతుందంటూ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ రెండుగా చీలిపోతుందంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీని వెనుక ఏదైనా కుట్ర జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోందన్న అశోక్‌బాబు.. బీజేపీ రెండుగా చీలిపోతుందేమో చూసుకోండి! అంటూ సెటైర్లు వేశారు. ఇక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోననేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు అశోక్ బాబు. చంద్రబాబు నేతృత్వంలో 21 విపక్ష పార్టీలు మోడీకి నియంతృత్వ విధానాలు, ఈసీ ఏకపక్ష వైఖరిపై పోరాటం చేస్తున్నాయన్న ఆయన... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఈసీ బాగా పనిచేసిందని మెచ్చుకోవడం బాధాకరమైన విషయమన్నారు.