బీటెక్ రవి దీక్ష భగ్నం...

బీటెక్ రవి దీక్ష భగ్నం...

కడపలో స్టీల్ ప్లాంట్ సాధన కోసం తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్షను భగ్నం చేశారు పోలీసులు... ఎనిమిదో రోజుల పాటు దీక్ష కొనసాగించిన ఇద్దరు నేతల ఆరోగ్యపరిస్థితి విషమించినట్టు వైద్యులు తెలిపారు. కాగా, తక్షణమే వైద్యం అందించకపోతే ఎమ్మెల్సీ బీటెక్ రవి అపస్మారకస్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు వైద్యులు. దీంతో అప్రమత్తమైన పోలీసులు... బీటెక్ రవిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు ఎమ్మెల్సీ బీటెక్ రవి. ఇక దీక్ష శిబిరంలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు ఎంపీ సీఎం రమేష్... బీటెక్‌ రవిని ఆస్పత్రికి తరలించే క్రమంలో టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు టీడీపీ కార్తకర్తలు.