'లగడపాటి సర్వే కంటే టీడీపీకి ఎక్కువ సీట్లు..!'

'లగడపాటి సర్వే కంటే టీడీపీకి ఎక్కువ సీట్లు..!'

లగడపాటి రాజగోపాల్ సర్వేకు మంచి తెలుగుదేశం పార్టీకి సీట్లు వస్తాయన్నారు ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. టీడీపీకి 130 సీట్లు గ్యారెంటీ అన్నారాయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోతుందన్న విషయం వైఎస్ జగన్‌కు తెలుసన్న బుద్దా... ప్రజలు సంక్షేమాన్ని నమ్మారు... సీఎం చంద్రబాబును కూడా నమ్మారు.. టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇక జగన్ ప్రతిపక్ష నాయకుడు అయితే అసెంబ్లీకి డుమ్మా కొడతారని వేరే వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారని సెటైర్లు వేసిన బుద్దా వెంకన్న... టీడీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని తిరగండి.. మన ప్రభుత్వం వస్తుంది. ఓవైపు టీడీపీ జెండా... మరోవైపు చంద్రబాబు ఫొటో ఉన్న జెండాలు రెండు బుజాలపై పెట్టుకుని ధర్జాగా తీరగాలని పిలుపునిచ్చారు.