'జగనాసురుడిని ఓటుతో అంతమొందించాలి..!'

'జగనాసురుడిని ఓటుతో అంతమొందించాలి..!'

వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న... మహిషాసురుడిని అంతమొందించినట్టుగా జగనాసురుడిని ప్రజలు ఓటుతో అంతమొందించాలని పిలుపునిచ్చారాయన. అమరావతిలో మీడియాతో మాట్లాడిన వెంకన్న.. జగన్మోహన్ రెడ్డి ఇరుకు సందుల్లో సభలు పెట్టి గ్రాఫిక్స్‌తో ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. నిన్న మిద్దె కూలి ఇద్దరు చనిపోయి, 80 మంది క్షతగాత్రులైతే కనీసం జగన్ పరామర్శించలేదని మండిపడ్డారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో మతిస్థిమితం తప్పి వైఎస్ జగన్ ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు బుద్దా వెంకన్న.