బొత్స నోటి నుంచి వచ్చిన మాట జగన్‌ చెప్పిందేనా..?

బొత్స నోటి నుంచి వచ్చిన మాట జగన్‌ చెప్పిందేనా..?

అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. బొత్స వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. రాజధానిపై బొత్స నోటి నుంచి వచ్చిన మాట.. సీఎం వైఎస్ జగన్ చెబితేనే వచ్చిందా..? అని ప్రశ్నించారు. రాజధానిపై తన అభిప్రాయాన్ని సీఎం వైఎస్ జగన్ వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ నెరవేర్చని వైసీపీ.. మేం చెప్పిన అంశాలను నిజమని నిరూపిస్తోందని సెటైర్లు వేశారు. ఎన్నికలకు ముందు మేం చెప్పిన మాటలు నిజమని జగన్ తన చర్యల ద్వారా నిరూపిస్తున్నారని.. అన్న క్యాంటీన్లు మూసేశారు.. సంక్షేమ పథకాలు ఆపేశారు.. పోలవరం నిలిపేశారు.. ఇప్పుడు రాజధాని సేఫ్ కాదంటున్నారని మండిపడ్డారు. రాజధానిని ముంపు నుంచి కాపాడేందుకు మేం లిఫ్ట్ పెడితే.. ఆ లిఫ్టునే వినియోగించే ప్రభుత్వం రాజధానిని ముంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇక మంత్రి బొత్స మాటలతో రాజధాని కొలాప్స్ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు బుద్దా వెంకన్న.