చంద్రబాబుకు భౌతికదాడుల ప్రమాదం!

చంద్రబాబుకు భౌతికదాడుల ప్రమాదం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై భౌతికదాడులు జరిగే ప్రమాదం ఉందన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న... విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతలు మహాకుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 2002లో గోద్రా ఘటనను వ్యతిరేకించిన కారణంగా చంద్రబాబుపై నరేంద్ర మోడీ కక్షగట్టారని... మోడీ ఉన్మాద చేష్టలను వ్యతిరేకించడం వల్లే ఇప్పుడు చంద్రబాబు టార్గెట్ చేశారని వెల్లడించారు బుద్దా వెంకన్న. అయితే దేశంలో నరేంద్ర మోడీని అడ్డుకునే సామర్థ్యం చంద్రబాబుకే ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ... నరేంద్ర మోడీ ఓ ఉన్మాది అంటూ మండిపడ్డ ఆయన... ముస్లిం సోదరులు చంద్రబాబు చేస్తోన్న ధర్మపోరాటానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అని జోస్యం చెప్పారు బుద్దా వెంకన్న.