'వైసీపీకి అధికారం కలే.. బీజేపీకి 120 సీట్లూ కష్టమే..!'

'వైసీపీకి అధికారం కలే.. బీజేపీకి 120 సీట్లూ కష్టమే..!'

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కలే అన్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఇక బీజేపీకి దేశవ్యాప్తంగా 120 లోక్‌సభ సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. వైసీపీకి విజయ్ సాయిరెడ్డి, సి. రామచంద్రయ్య, బీజేపీకి జీవీఎల్ శకునులుగా మారారని ఎద్దేవా చేశారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే సి. రామచంద్రయ్య కూడా చంద్రబాబుని విమర్శిస్తున్నారని మండిపడ్డారు బుద్దా వెంకన్న.. టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా  ఉండి.. కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. మళ్లీ ప్రజారాజ్యంలోకి వచ్చి.. జగన్ మీద విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్ పంచన చేరి.. చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారని.. ఊసరవెల్లి కంటే ఎక్కువగా రామచంద్రయ్య రంగులు మారుస్తున్నారని సెటైర్లు వేశారు. పదవులు కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడకండి అని సూచించారు వెంకన్న.. వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ జపం చేస్తున్నారు. మీ పార్టీ అధికారంలోకి రావడం కలేనని జోస్యం చెప్పారు. పూటకో పార్టీ మారే సి. రామచంద్రయ్యను  వైసీపీ కార్యకర్తలే గుర్తు పట్టడం లేదని ఎద్దేవా చేసిన ఆయన.. మోడీతో కుమ్మక్కై వైసీపీ చేసిన  ఈవీఎంలు మొరాయింపు కుమ్మక్కుల పైన, నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్ష జరిపారని తెలిపారు.