'మంచు కరిగి మోహన్‌బాబు ముసుగు బయటపడింది!'

'మంచు కరిగి మోహన్‌బాబు ముసుగు బయటపడింది!'

సినీనటుడు మోహన్ బాబు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై సెటైర్లు వేశారు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మోహన్ బాబు చేరాల్సిన గూటికే చేరారు.. రాక్షసులంతా ఒకవైపు ఉన్నారని విమర్శించారు. మంచు ఫ్యామిలీ ముంచే ఫ్యామిలీ అని ఎద్దేవా చేసిన రాజేంద్రప్రసాద్.. మంచు కరిగి వారి ముసుగు బయటపడిందన్నారు. విద్యార్ధుల ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా ఎంత దోచుకున్నాడో సాక్ష్యాధారాలతో బయటపెట్టామని.. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాసంస్ధల పేరుతో మోహన్ బాబు చేస్తున్న అవినీతిపై విచారణ జరుపుతామని ప్రకటించారు. 

ఇక జగన్... కేసీఆర్‌తో కలవడం ముమ్మాటికీ తప్పే అన్నారు వైవీబీ రాజేంద్ర ప్రసాద్... ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌కు జగన్ బానిసగా వ్యాఖ్యానించిన ఆయన.. కేసీఆర్‌కు వైఎస్ జగన్ ఓ పెయిడ్ వర్కర్... జగన్‌ను గెలిపించి విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం ఆపించాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  కేసీఆర్‌ను చూస్తేనే ఆంధ్ర ప్రజలకు తేళ్లు, జెర్రిలు పాకినట్టుగా ఉంటుందన్న రాజేంద్రప్రసాద్... ఆంధ్ర ద్రోహి కేసీఆర్‌తో వైఎస్ జగన్ జతకట్టడం సిగ్గుచేటన్నారు. జగన్ కో హఠావో.. ఏపీ కో బచావో అంటూ కొత్త నినాదాన్ని ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ.