'మోహన్‌బాబువి సిల్లీ ఫెలో వేషాలు..!'

'మోహన్‌బాబువి సిల్లీ ఫెలో వేషాలు..!'

సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్‌బాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్... తమకు విద్యాసంస్థకు రావాల్సిన ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం ఆలస్యం చేస్తోందంటూ ఆయన ఆందోళనకు దిగడంపై స్పందించిన ఆయన.. మోహన్ బాబు.. సిల్లీ ఫెలో వేషాలు వేస్తున్నారంటూ మండిపడ్డారు. మోహన్ బాబు సిల్లీగా వ్యవహరిస్తూ గల్లీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్.. ఏ ఒక్క కాలేజీ యాజమాన్యం రోడ్డెక్కలేదు.. మోహన్ బాబు ఒక్కరే ఎందుకు రోడ్డెక్కారు..? అని ప్రశ్నించారు. మోహన్ బాబు డ్రామాలన్నీ ప్రజలు చూస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ... పసి పిల్లలను రోడ్డెక్కిస్తే ప్రజలు చూస్తూ సహించరు.. రోడ్డెక్కి తైతక్కలాడితే ప్రజలు ఊరుకోరు అంటూ హెచ్చరించారు.