ఓటమి దిశగా టీడీపీ ఎమ్మెల్సీలు..

ఓటమి దిశగా టీడీపీ ఎమ్మెల్సీలు..

సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగిన టీడీపీ ఎమ్మెల్సీలు ఓటమిబాట  పాట్టారు... ఎమ్మెల్సీలుగా ఉంటూ ఎనిమిది మంది నేతలు ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుని పోటీచేయగా... ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్సీల్లో ఒకరు ఆధిక్యంలో ఉండగా... మిగతా ఏడుగురు వెనుకంజలో ఉన్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, ప్రత్తిపాడు నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి,  బాపట్ల నుంచి అన్నం సతీష్ ప్రభాకర్, నెల్లూరు సిటీ నుంచి నారాయణ, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెనుకంజలో ఉండగా... చీరాల నుంచి మాత్రం కరణం బలరామకృష్ణమూర్తి ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం విజయం సాధించారు. విజయనగరం ఎమ్మెల్యేగా కోలగట్ల, ఏలూరు నుంచి ఆళ్ల నాని విజయం సాధించగా... ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగిన మాగుంట శ్రీనివాసరెడ్డి ముందంజలో ఉన్నారు.