దీక్ష విరమించిన సీఎం రమేష్...

దీక్ష విరమించిన సీఎం రమేష్...

కడపలో స్టీల్ ప్లాంట్‌ కోసం దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ దీక్ష విరమించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రమేష్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్సీ బీటెక్ రవితో కలిసి ఆమరణదీక్షకు దిగారు ఎంపీ సీఎం రమేష్... జడ్పీ కార్యాలయం ఆవరణలో దీక్షకు దిగగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల 27వ తేదీన బీటెక్ రవి దీక్ష భగ్నం చేసిన ఆస్పత్రికి తరలించారు పోలీసులు.