సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య..

సీఎం రమేష్ మేనల్లుడు ఆత్మహత్య..

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ కావడం, తక్కువ మార్కులు వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ హైదరాబాద్‌లో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ ఆత్మహత్య చేసుకున్నారు. నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివిన ధర్మారామ్... ఫరీక్షలో ఫెయిల్ కావడంతో శ్రీనగర్‌ కాలనీలో ఏడో ఫ్లోర్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి.