ఆ ప్రచారంలో వాస్తవం లేదుః సీఎం రమేష్

ఆ ప్రచారంలో వాస్తవం లేదుః సీఎం రమేష్

టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారడంలేదని ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన టీడీపీ రాష్ట్ర స్ధాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పుపై తమను ఎవరూ సంప్రదించలేదని.. తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదన్నారు. పార్టీ మారే అవసరం ఎవరికీ లేదని చెప్పారు. తమ పార్టీ వ్యూహకర్తగా నియమించేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ను సంప్రదించామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎం రమేశ్‌ స్పష్టంచేశారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ తరుపున కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు. అయితే టీడీపీ తరఫున గెలిచిన, ఓడిన కొందరు కీలకనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీ కండువా కప్పుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.