లోక్‌సభలో 'భరత్ అనే నేను' స్టోరీ

లోక్‌సభలో 'భరత్ అనే నేను' స్టోరీ

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'భరత్ అనే నేను' సినిమా కథ చెప్పారు జయదేవ్... ఇచ్చిన మాట తప్పరాదనేది సినిమా నేపథ్యమని... అదే తరహాలో నరేంద్ర మోదీ సర్కార్‌ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన జయదేవ్... ఇది మెజార్టీ, మోరాలిటీ మధ్య జరుగుతున్న ధర్మ యుద్ధంగా అభివర్ణించారు. ఇది టీడీపీ-బీజేపీ మధ్య పోరాటం కాదని స్పష్టం చేసిన గల్లా... ఎన్డీయే నుంచి రాగానే తమపై కక్ష కట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా సహా అన్ని హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు గల్లా జయదేవ్. గతంలో బాహుబలి వసూళ్ల కంటే... ఏపీకి కేంద్రం ఇచ్చింది తక్కువే నంటూ కేంద్రంపై సెటైర్లు వేసి ఆకట్టుకున్న జయదేవ్... ఈ సారి 'భరత్ అనే నేను' స్టోరీ చెప్పి ఆలోచింపజేశారు.