ఎన్నికల ఫలితాలు ఓ షాక్..!

ఎన్నికల ఫలితాలు ఓ షాక్..!

ఎన్నికల ఫలితాలు తనకు ఓ షాక్ అన్నారు విజయవాడ ఎంపీ కేశినేని నాని... టీడీపీ ఓటమిపై విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఓటమి గల కారణాలపై, ఐదేళ్ల పాలనపై విశ్లేషణ చేసుకుంటామని తెలిపారు. ప్రజలు మానుంచి ఇంకా ఏదో ఆశించారని చెప్పుకొచ్చారు కేశినేని... మరోవైపు బెజవాడలో మరోసారి ఎంపీగా తాను విజయం సాధించడంపై మాట్లాడుతూ... బెజవాడను, నన్ను విడదీసి చూడలేరు.. .అందుకే నన్ను మళ్ళీ గెలిపించారని వ్యాఖ్యానించారు. నగరాన్ని వేరేవాళ్ల పాలుకాకుండా రెండు సార్లు అడ్డుకున్నానన్న ఆయన.. ప్రజలతో ఉన్న అనుబంధం నన్ను ఈ సమయంలో గెలిపించిందన్నారు. హోదా విషయంలో కేంద్రం ఏమి చేస్తుందో చూడాలన్నారు.