సీఎం గారు..! కొంచెం క్లారిటీ ఇవ్వండి..!

సీఎం గారు..! కొంచెం క్లారిటీ ఇవ్వండి..!

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయారు టీడీపీ ఎంపీ కేశినేని నాని.. పార్టీలో వివాదం చెలరేగినప్పుడు ఆయన చేసిన పోస్టులు చర్చగా మారగా.. ఆ తర్వాత ప్రజావేదిక కూల్చివేతపైనా తనదైన శైలిలో స్పందించి చర్చకు తెరలేపారు. ఇక, ప్రజావేదిక కూల్చివేత తర్వాత కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలకు నోటీసులు ఇస్తున్న తరుణంలో మరోసారి ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు విజయవాడ ఎంపీ కేశినేని.. ఆయన ఎఫ్‌బీ పోస్ట్‌ను పరిశీలిస్తే.. "గౌరవ ముఖ్యమంత్రి గారు.. నదీ తీర ప్రక్షాళన కేవలం అరవై - డెబ్భై అక్రమ కట్టడాలకు మాత్రమే పరిమితం చేస్తారా? లేకపోతే మన రాష్ట్రంలో కృష్ణా మరియు గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో రాష్ట్ర సరిహద్దు నుండి మొదలుపెట్టి ఆ నదులు సముద్రంలో కలిసే వరకు ఉన్నటువంటి అన్ని అక్రమకట్టడాలను రివర్ కన్సర్వేటివ్ యాక్ట్ ప్రకారం తొలగిస్తారా! .. కొంచెం రాష్ట్ర ప్రజలకు వివరించగలరు" అంటూ పోస్ట్ చేవారు. ఓవైపు వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయాలపై సెటైర్లు వేస్తూనే.. మరోవైపు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేశినేని నాని.